ఈ ఏడాది అత్యధిక రెమ్యూనరేషన్ వీళ్లకే

2020లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న సెలబ్రెటీల జాబితాతో తాజాగా ఫోర్బ్స్ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో అమెరికాకు చెందిన రియాలిటీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ టాప్‌లో నిలిచింది. ఈ ఏడాది ఆమె 590 మిలియన్లు సంపాదించినట్లు ఫోర్బ్స్ పేర్కొంది. ఇక రెండో స్థానంలో అమెరికన్ రాపర్ కాన్యే వెస్ట్ నిలిచాడు. అతడు ఈ ఏడాదిలో 170 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలిపింది. కరోనా ప్రభావం కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడం వల్ల గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సెలబ్రెటీల రెమ్యూనరేషన్ తగ్గినట్లు పేర్కొంది.

టాప్ 10 జాబితాలో స్థానం సంపాదించుకున్న సెలబ్రెటీల అందరి రెమ్యూనరేషన్ 6.1 బిలియన్ డాలర్లుగా ఉంది. 2019లో మొత్తంతో పోలిస్తే 200 మిలియన్ డాలర్లు తక్కువగా సంపాదన ఉన్నట్లు తేలింది. ఇక ప్రముఖ అథ్లెట్లు ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డో, మెస్సి, నైమర్ టాప్ 10లో స్థానం సంపాదించుకున్నారు.

ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ 100 డిజిటల్ స్టార్స్ జాబితాలో 12 మంది భారతీయుల పేర్లు ఉన్నాయి. ప్రతి ఏడాది ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదలు చేస్తూ ఉంటుంది. వివిధ రంగాలకు చెందిన సెలబ్రెటీల సంపాదన వివరాలను సేకరించి ఈ జాబితా తయారుచేస్తూ ఉంటుంది.