Manchu Mohanbabu: హ్య‌పీ బ‌ర్త్‌డే గాడ్ ఫాద‌ర్‌.. డైలాగ్‌కింగ్‌కు “స‌న్నాఫ్ ఇండియా” టీం బ‌ర్త్‌డే విషెస్‌!

Manchu Mohanbabu: బ‌హుముఖ న‌టుడు, విల‌క్ష‌ణ న‌టుడు, డైలాగ్ కింగ్‌, క‌లెక్ష‌న్ కింగ్ వంటి పేర్ల‌తో టాలీవుడ్ లో గుర్తింపు సంపాదించుకున్న న‌టుడు మంచు మోహ‌న్‌బాబు. నేడు ఆయ‌న జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా Manchu Mohanbabuపెద‌రాయుడు గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంటూ విషెస్ తెలుపుతున్నారు అభిమానులు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న న‌టిస్తున్న‌ తాజా చిత్రం స‌న్నాఫ్ ఇండియా మూవీ టీం బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

Son of india

హ్యాపీ బ‌ర్త్ డే గాడ్ ఫాద‌ర్ అంటూ.. జాతీయ జెండాలోని త్రివ‌ర్ణ రంగులు బ్యాగ్రాండ్‌లో క‌నిపిస్తుండ‌గా..Manchu Mohanbabu మోహ‌న్‌బాబు మెడ‌లో రుద్రాక్ష ధ‌రించి మాస్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని 24ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ, శ్రీ ల‌క్ష్మీ ప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై మంచు విష్ణు నిర్మిస్తున్నాడు. డైమండ్ ర‌త్న‌బాబు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. మోహ‌న్‌బాబు స్ర్కీన్‌ప్లే స‌మ‌కురుస్తున్నారు. ఇక ఈManchu Mohanbabu చిత్రానికి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా స్వ‌రాలు అందిస్తున్నారు.