Tollywood: ఎన్టీఆర్ హీరోయిన్ చిన్న‌నాటి ఫోటోపై నెగెటివ్ కామెంట్స్‌.. న‌టి ఆవేద‌న‌!

Tollywood: స‌మీరారెడ్డి గుర్తుంది క‌దా.. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అశోక్ చిత్రంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న న‌టి స‌మీరారెడ్డి. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం న‌మోదు చేసుకుంది. అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ చిత్రంలో న‌టించి మెప్పించింది స‌మీరా. కృష్ణం వందే జ‌గ‌ద్గురుం చిత్రంలో స‌మీరా రెడ్డి ఐటెం సాంగ్ చేసింది. 2013లో విడుద‌లైన వ‌ర‌ద నాయ‌క అనే క‌న్న‌డ చిత్రం త‌ర్వాత సినీ ప‌రిశ్ర‌మ‌కు గుడ్ బై చెప్పింది స‌మీరా రెడ్డి. ఇప్పుడు ప్ర‌స్తుతం ఆమె వైవాహిక జీవితంలో బిజీగా ఉంది.. కానీ సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న విష‌యాల‌ను ఎప్పటిక‌ప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.

Actress sameerareddy

ఈ నేప‌థ్యంలో త‌న చిన్న‌నాటి ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో బాగా లావుగా, న‌ల్ల‌గా క‌నిపించింది స‌మీరా రెడ్డి. దీంతో అంద‌రూ నెగెటివ్ కామెంట్స్ చేశారు. ఆ ఫోటోపై వ‌చ్చిన నెగెటివ్ కామెంట్‌పై ఆమె స్పందిస్తూ.. శ‌రీరాకృతిపై బ‌య‌టివాళ్లు చేసే కామెంట్స్ త‌ట్టుకోవ‌డం ఎంతో క‌ష్ట‌మైన విష‌య‌మ‌ని పేర్కొన్నారు. స‌మాజంలో ఉండే ప్రతి విష‌యాన్ని ఓర్పుగా ఎదుర్కొవాల‌ని.. ఎలాంటి వారినైనా స‌రే ఒకేలా చూడాల‌నే విష‌యాన్ని త‌న పిల్ల‌ల‌కు నేర్పుతాన‌ని స‌మీరా రెడ్డి తెలిపింది.‌