సరికొత్త రివెంజ్ డ్రామా… తిప్పరా మీసం

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి సోలో హీరో స్థాయికి ఎదిగిన హీరో శ్రీ విష్ణు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తూనే హీరోగా నటిస్తున్న శ్రీ విష్ణు నటిస్తున్న లేటెస్ట్ మూవీ తిప్పరా మీసం. నారా రోహిత్ హీరోగా అసుర సినిమాని తెరకెక్కించి మొదటి సినిమాతోనే మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణ విజయ్, చాలా గ్యాప్ తీసుకోని చేస్తున్న సినిమా ఈ తిప్పరా మీసం. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అందరినీ ఆకట్టుకున్న తిప్పరా మీసం టీజర్ ని రిలీజ్ చేశారు.

మెలితిప్పిన మీసం, గుబురు గడ్డంతో శ్రీ విష్ణు లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది, టీజర్ లోని ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంది. ముఖ్యంగా లైటింగ్ ప్యాట్రన్ టీజర్ కి కొత్త ఫీల్ ని తెచ్చింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ అన్నీ పర్ఫెక్ట్ గా కుదరడంతో తిప్పరా మీసం టీజర్ ని రెగ్యులర్ రివెంజ్ డ్రామాని చూస్తున్నాం అనే ఫీలింగ్ ని కలగకుండా చేశాయి. శ్రీ విష్ణు చాలా మెచ్యూర్డ్ కమర్షియల్ హీరోగా కనిపించాడు. కృష్ణ విజయ్ అండ్ రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తిప్పరా మీసం టీజర్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.