హిందీలో రష్మిక… ఎంట్రీ ఆ సినిమాతోనేనా?

ఫస్ట్ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన ఛలో హీరోయిన్ రష్మిక మందన్న, కన్నడ నుంచి ఇటు వైపు వచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గీతా గోవిందం సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రీసెంట్ గా డియర్ కామ్రేడ్ సినిమాతో సౌత్ ఆడియన్స్ అందరికీ పరిచయం అయిన రష్మిక, తమిళ మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ పక్కన నటించే అవకాశం కొట్టేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్ నుంచి బంపర్ వచ్చిందని తెలుస్తోంది.

రీసెంట్ గా డియర్ కామ్రేడ్ ప్రీమియర్ షో కోసం ముంబై వెళ్లిన రష్మికకి, కరణ్ జోహార్ నిర్మించబోయే సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. నాని నటించిన జెర్సీ సినిమా సూపర్ హిట్ అయ్యింది, దీంతో ఈ మూవీ రీమేక్ రైట్స్ ని కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ లో సూపర్బ్ యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్న షాహిద్ కపూర్, జెర్సీ రీమేక్ లో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదు కానీ హీరోయిన్ గా మాత్రం రష్మికని ఫైనల్ చేశారట. సౌత్ నుంచి నార్త్ వరకూ అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తున్న రష్మిక, టాప్ చైర్ టార్గెట్ గా సినిమాలు చేస్తుంది.