దళపతి విజయ్ ‘వేట్టైకారన్’ చిత్ర దర్శకుడి మృతి

దళపతి విజయ్ నటించిన హిట్ సినిమా వేట్టైకారన్. 2009లో వచ్చిన ఈ మూవీ వరస ఫ్లాప్స్ లో ఉన్న విజయ్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది. కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు బాబు శివన్. దర్శకుడు ధరణికి అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బాబు శివన్ లివర్ ఫెయిల్యూర్ కారణంగా చెన్నైలో మరణించారు.

విజయ్ కొరివి సినిమాకి డైలాగ్స్ అందించిన బాబు శివన్, ఆ తర్వాత వేట్టైకారన్ ని డైరెక్ట్ చేశాడు. ఇది హిట్ అయిన తర్వాత కూడా డైరెక్టర్ గా చాలా కాలం పాటు అవకాశాలు రాకపోవడంతో బాబు శివన్, విజయ్ 2017లో నటించిన భైరవ సినిమాకే కథా సహకారం అందించారు. ఈ మధ్యలో రాసాతి అనే టీవీ సీరియల్ కి కొన్ని ఎపిసోడ్స్ కూడా డైరెక్ట్ చేసిన బాబు శివన్ హఠాన్మరణం కోలీవుడ్ వర్గాలని కదిలించింది. ఈ సందర్భంగా వేట్టైకారన్ సినిమాకి మ్యూజిక్ అందించిన హీరో విజయ్ ఆంటోనీ, బాబు శివన్ తో ఉన్న జ్ఞాపకాలని తలుచుకుంటూ ట్వీట్ చేశాడు.