ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన పవన్ మహేశ్ చిరు…

సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో #HappyBirthdayPMModi అనే ట్యాగ్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకూ దాదాపు 287k ట్వీట్స్ ఈ ట్యాగ్ తో పోస్ట్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మోదీకి విషెష్ చెప్పిన వారిలో సినీ తారలు కూడా ఉన్నారు. టాలీవుడ్ నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోదీకి విషెష్ చెప్తూ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. మీ లీడర్ షిప్, విజన్ దేశాన్ని చాలా విషయాల్లో ముందుకి తీసుకోని వెళ్లిందని అన్నారు.

పవర్ స్టార్, సూపర్ స్టార్ లతో పాటు మెగాస్టార్ కూడా మోదీకి విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు.