Thalaivi: ఎంజీఆర్‌గా అర‌వింద‌స్వామి.. అచ్చం ఆయ‌న‌లా ఉన్నాడని ఫ్యాన్స్ ఆనందం!

Thalaivi: త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత బ‌యోపిక్‌పై త‌లైవి చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్ర‌లో అర‌వింద‌స్వామి న‌టిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అర‌వింద్‌స్వామి, స‌ముద్ర‌ఖ‌ని ఫోటోను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. దీంతో ఈ ఫోటోలో అర‌వింద‌స్వామి అచ్చం ఎంజీఆర్ లాగానే ఉన్నార‌ని త‌మిళ ప్రేక్ష‌కులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

aravindaswamy

Thalaivi త‌మిళుల ఆరాధ్య‌దైవం అన్నా డీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు ఎంజీఆర్ పాత్ర‌ను అర‌వింద‌స్వామి ఈ సినిమాలో పోషిస్తుండ‌గా.. జ‌య‌ల‌లిత పాత్ర‌లో బాలీవుడ్ లేడి టైగ‌ర్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ప్రోమోలు ఆస‌క్తిని రేకెత్తించాయి.Thalaivi జ‌య‌ల‌లిత‌, ఎంజీఆర్ వార‌సురాలిగా త‌మిళ‌నాట ఖ్యాతిని సంపాదించారు. ఇక ఇటీవ‌లే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. జ‌య‌ల‌లిత పాత్ర‌లో కంగ‌నా న‌టిస్తుండ‌డంతో.. ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని ఎ ఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.