సుప్రీం దెబ్బతో దిగొచ్చిన జగన్ ప్రభుత్వం.. పంచాయతీ పోరుకు సై

సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో.. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. ఎన్నికలకు ఒప్పుకునేది లేదంటూ మొన్నటివరకు మొండిగా వ్యవహరించిన జగన్ సర్కార్.. సుప్రీం తీర్పుతో పంచాయతీ పోరుకు ఒకే చెప్పింది. సుప్రీం తీర్పును గౌరవిస్తున్నామని, ఎన్నికల సంఘం నిర్ణయించినట్టుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని వైసీపీ ముఖ్యనేత, ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సబ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియకు ముందుకెళ్లాలని అధికారులను ఆదేశాలిచ్చామన్నారు.

JAGAN AP PANCHAYAT ELECTIONS

జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మధ్యలోనే ఆపేసి పంచాయతీ ఎన్నికలు తీసుకురావడంలో రాజకీయ కుట్ర ఉందని సజ్జల ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలను తాము ఎదుర్కొంటామని, తామే గెలుస్తామని సజ్జల జోస్యం చెప్పారు. తమ ఇబ్బందులను ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతోనే సుప్రీంకోర్టుకు వెళ్లామన్నారు.