KRACK BOLLYWOOD REMAKE: బాలీవుడ్‌లోకి క్రాక్ రీమేక్?.. హీరో ఎవరంటే?

KRACK BOLLYWOOD REMAKE: రవితేజ-శృతిహాసన్ కాంబినేషన్‌లో గోపీచంద్ మలినేని తెరకెక్కించని క్రాక్ సంక్రాంతిగా కానుకగా విడుదలై సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ వసూళ్లు సంపాదించుకుని బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రియల్ లైఫ్‌లో చోటుచేసుకున్న నిజజీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను గోపీచంద్ తెరకెక్కించాడు. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ నటన అందరినీ ఆకట్టుకోగా.. విలన్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటన కూడా బాగుంది.

KRACK BOLLYWOOD REMAKE

తెలుగులో హిట్ అయిన క్రాక్‌ను హిందీలోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గోపీచంద్ మలినేని ఈ విషయాన్ని వెల్లడించాడు. బాలీవుడ్‌లోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, చాలామంది సంప్రదిస్తున్నారని చెప్పాడు. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్, రణ్ వీర్ సింగ్, సల్మాన్ ఖాన్‌లకు ఈ కథ బాగా సరిపోతుందన్నాడు.