రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

మాస్ మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఖిలాడి. రమేష్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే రేపు రవితేజ బర్త్ డే సందర్భంగా.. ఖిలాడీ యూనిట్ బర్త్ డే గిప్ట్ అందించనుంది.

KhiladiFirstGlimpse

రవితేజ బర్త్ డే సందర్భంగా ఖిలాడి ఫస్ట్ గింప్స్‌ను రేపు ఉదయం 10.08 గంటలకు సినిమా యూనిట్ విడుదల చేయనుంది. ఇప్పటికే విడుదలైన ఖిలాడి పోస్టర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ సృష్టించాయి. దీంతో ఫస్ట్ గింప్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి రవితేజ అభిమానుల్లో నెలకొంది. ఇందులో రవితేజ డ్యయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేసే అవకాశముంది.