తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగు సినీ నిర్మాతలు

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారు, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీస్ టి. ప్రసన్న కుమార్ గారు, వై.వి.ఎస్. చౌదరి గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సునీల్ నారంగ్ గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అనుపం రెడ్డి గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, సెక్రటరీ దొరై, నిర్మాతలు స్రవంతి రవి కిషోర్, సుప్రియ యార్లగడ్డ, భరత్ చౌదరి, బాపినీడు చౌదరి, రోహిణి రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ గారు నేడు సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నివాసంలోనే కాసేపు కూర్చొని ముచ్చటించారు