తొలిసారి ఆ పనిచేసిన హీరో విజయ్

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమా కెరీర్‌లోకి అడుగుపెట్టి దాదాపు 30 ఏళ్లు పూర్తి అయింది. కానీ సినిమాల్లో ఇప్పటివరకు చేయని ఆ పనిని ఇప్పుడు విజయ్ చేశాడటని వార్తలొస్తున్నాయి. అది ఏంటంటే.. సిక్స్ ప్యాక్ బాడీ.. ఇప్పటివరకు విజయ్ నటించిన ఏ సినిమాల్లోనూ చొక్కా విప్పేసి సిక్స్ ప్యాక్ బాడీ చూపించలేదు. కానీ త్వరలో విడుదల అవుతున్న మాస్టర్ సినిమాలో విజయ్ సిక్స్ ప్యాక్ బాడీ చూపించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

vijay six pack body
vijay six pack body

లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో విజయ్ నటించిన మాస్టర్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 13న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అభిమానుల కోసం విజయ్ సిక్స్ ప్యాక్ బాడీ చూపించాడని తెలుస్తోంది. ఈ వార్త బయటికి రావడంతో.. విజయ్ అభిమానులు దీని కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాను తొలుత తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ చివరికి హిందీ, కన్నడ భాషలతో కలిసి పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో హీరోయిన్‌గా మాళవిక మోహన్ నటించింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు థియేటర్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేస్తున్నారు.