లైవ్‌లో హీరోయిన్‌ను ఐలవ్యూ చెప్పమన్న డైరెక్టర్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలోకి కూడా ఆమె అడుగుపెట్టబోతోంది. కోలీవుడ్ హీరో శింబు హీరోగా వస్తున్న ఈశ్వరన్ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. తాజాగా చెన్నైలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది.

nidhi agarwal love you
nidhi agarwal love you

ఈ ఫంక్షన్‌లో నిధి అగర్వాల్‌కి చేదు అనుభవం ఎదురైంది. స్టేజ్‌పై నిధి మాట్లాడుతున్న సమయంలో.. ఆ సినిమా డైరెక్టర్ సుసీస్థారన్ వచ్చాడు. హీరో శింబుకు ఐ లవ్ యూ చెప్పాలన్నాడు. సింబు మామా.. ఐలవ్‌యూ అని చెప్పాలని నిధికి డైరెక్టర్ చెప్పాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన నిధి డైరెక్టర్ మాటలకు షాక్ అయింది. డైరెక్టర్ చెప్పిన పని చేయకుండా వేరే టాపిక్ మాట్లాడుతోంది. డైరెక్టర్ మాత్రం అదే పనిగా ఆ మాటలు చెప్పాలని నిధికి చెబుతున్నాడు.

లైవ్‌లో అందరూ చూస్తుండగా ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో దీనిపై డైరెక్టర్ సుసీస్థారన్ స్పందించాడు. సింబు మామా.. ఐ లవ్ యూ అనే డైలాగ్ సినిమాలో ఉందని, అందుకని ప్రమోషన్స్ కోసం స్టేజీపై చెప్పాలని కోరానన్నాడు.