డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?

డ్రగ్స్ టాలీవుడ్‌లో కలకలం రేపుతూనే ఉన్నాయి. గతంలో డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌కి చెందిన పలువురు సెలబ్రెటీలను అధికారులు ప్రశ్నించడం సంచలనం రేపింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌, హీరోయిన్ ఛార్మి, మమైత్ ఖాన్‌లతో పాటు పలువురు సెలబ్రెటీలు విచారణకు హాజరుకావడంతో.. టాలీవుడ్‌లో డ్రగ్స్ వాడకం విపరీతంగా ఉందని వార్తలు వచ్చాయి. ఇక బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు సంచలనం రేపింది. ఇందులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నమ్రత పేర్లు తెరపైకి వచ్చాయి.

swtha kumari tollywood heroine
swtha kumari tollywood heroine

ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా డ్రగ్స్ కేసులో ఒక టాలీవుడ్ హీరోయిన్‌ను ముంబై ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది మాత్రం అధికారులు బయటపెట్టడం లేదు. ఆ హీరోయిన్ పేరు స్వేత కుమారి. నాలుగు తెలుగు సినిమల్లో సెకండ్ హీరోయిన్‌గా ఆమె నటంచింది. స్వేత కుమారిని ప్రశ్నించిన ఎన్సీబీ అధికారులు.. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ముంబైలోని మీరా రోడ్డులో ఉన్న ఒక పెద్ద హోటల్‌లో డ్రగ్స్ రాకెట్‌ను పోలీసులు పట్టుకున్నారు.

డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న సయిూద్, చాంద్ మహమ్మద్ అనే వ్యక్తులతో పాటు టాలీవుడ్ హీరోయిన్‌ స్వేత కుమారిని పోలీసులు పట్టుకున్నారు. 400 గ్రాముల ఎండీ అనే మాదకద్రవ్యాన్ని సీజ్ చేశారు. దీని విలువ మార్కెట్లో 10లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. పలు బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాల్లో స్వేత కుమారి హీరోయిన్‌గా నటించింది.