సూర్యకు భారీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుసా?

కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఉన్న సూర్యకు తెలుగులోనూ చాలామంది అభిమానులు ఉన్నారు. తెలుగులోకి డబ్ అయిన ఆయన సినిమాలు ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సూర్యకి సంబంధించిన ఏ సినిమా చూసినా.. ఆయన నటన మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే సూర్యకు అంతమంది అభిమానులు ఉన్నారు. మన సౌత్ ఇండియాలోనే అత్యంత పాపులర్ హీరోగా కూడా సూర్య ఉన్నాడు.

surya remunaration
surya remunaration

ఇటీవల సూర్య హీరోగా వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కవమంది సెర్చ్ చేసిన సౌత్ ఇండియా సినిమాగా ఇది నిలిచింది. ఈ సినిమాతో కామన్ మెన్ పాత్రలో సూర్య నటన అందరినీ అలరించింది. దీంతో ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ క్రమంలో సూర్య రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ‘వాడి వాసల్’ పేరుతో వస్తున్న సినిమాలో సూర్య నటిస్తున్నాడు. ఈ సినిమాకు గాను సూర్య రూ.35 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. వెట్రిమారన్ ఈ సినిమాను దర్శకత్వం వహించనున్నాడు.