మోహన్‌లాల్, ధనుష్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

నూతన సంవత్సరం సందర్భంగా 2020వ సంవత్సరానికి సౌత్ ఇండియా దాదా సాహెబ్ పాల్కే అవార్డులను ప్రకటించారు. సౌత్ ఇండియాలోని తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ సినిమాలలోని వారికి ఈ అవార్డులు ఇస్తారు. తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి మోస్ట్ వర్సటైల్ యాక్టర్‌గా అజిత్ కుమార్ నిలవగా.. బెస్ట్ యాక్టర్ అవార్డు ధనుష్‌కి దక్కింది. అసురన్ సినిమాలోని తన అద్భతమైన నటనకు గాను ధనుష్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. ఉత్తమ నటి అవార్డు జ్యోతికాకు లభించింది. రాట్చాసి సినిమాకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది.

dhanush dada shaheb  award
dhanush dada shaheb award

బెస్ట్ డైరెక్టర్‌గా ఆర్ పార్థిబాన్ నిలవగా.. ఉత్తమ సినిమాగా టూ లెట్ నిలిచింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అనిరుధ్ రవీచందర్‌కి దక్కింది. ఇక మలయాళం నుంచి బెస్ట్ వర్సటైల్ యాక్టర్‌గా మోహన్ లాల్ నిలిచారు. Android కుంజప్పన్ Ver 5.25 సినిమాలోని నటనకు గాను బెస్ట్ యాక్టర్‌గా సూరజ్ వెంజరమూడు అవార్డు దక్కించుకున్నాడు. ఉత్తమ నటిగా పార్వతి తిరువోతు, ఉత్తమ డైరెక్టర్‌గా మధు సి నారాయణన్ అవార్డు దక్కించుకున్నారు.

బెస్ట్ ఫిల్మ్‌గా ఉయారే నిలవగా.. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దీపక్ దేవ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్నాడు. ఇక కన్నడ సినిమా పరిశ్రమ నుంచి బెస్ట్ వర్సటైల్ యాక్టర్‌గా శివరాజ్ కుమార్, బెస్ట్ యాక్టర్‌గా రక్షిత్ శెట్టి, ఉత్తమ నటిగా తానా హోప్, బెస్ట్ డైరెక్టర్‌గా రమేష్ ఇందిరా నిలిచారు. ఇక మూకాజ్జియ కనసుగలు సినిమా బెస్ట్ ఫిల్మ్‌గా నిలవగా.. వి హరికృష్ణ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డు దక్కించుకున్నాడు.