ఇండియన్ జేమ్స్ బాండ్ గా నటించడానికి రెడీ అవుతున్న సూపర్ స్టార్

సూపర్ స్టార్ రజనీకాంత్ కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుని ఇటీవల శివ దర్శకత్వంలో చేస్తున్న అన్నాత్తే సినిమా షూటింగ్ కోసం కోల్కతా వెళ్లారు. ఈ షెడ్యూల్ తో అన్నాత్తే సినిమా కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత రజిని ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడు అనే విషయంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఒక లేటెస్ట్ న్యూస్ బయటకి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

భారతీయ గూడచారి గా పాకిస్థాన్ దేశంలో అనేక సంవత్సరాలు ఉండి వాళ్ళ రహస్య విషయాలను ఇండియాకి చేరవేస్తూ పేరుపొందిన అజిత్ దోవల్ బయోపిక్ లో రజినీకాంత్ నటించడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇండియన్ స్పైగా అజిత్ దోవల్ తెలియని వారు ప్రపంచంలో ఎవరూ ఉండరు. ముఖ్యంగా పాకిస్తాన్ దేశానికి ముచ్చెమటలు పట్టించిన వ్యక్తి. పాన్ ఇండియా నేపథ్యంలో ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అజిత్ దోవల్ ప్రస్తుతం ప్రధాని మోడీ కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా రాణిస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ గొడవ కి కారణమైన జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి స్పెషల్ స్టేటస్ తీసివేయడంలో అజిత్ దోవల్ పాత్ర ఎంతో ఉంది. సమస్యాత్మకమైన పరిస్లోథితుల్లో అజిత్ దోవల్ ఇచ్చిన సూచనలు చాలావరకు భారత ప్రభుత్వానికి మేలు చేయడం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. ఇటువంటి డిఫరెంట్ లెజెండ్ డైనమిక్ పర్సనాలిటీ క్యారెక్టర్ లో రజిని నటించడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. ఇది నిజం అయితే రజినీకాంత్ మూవీకి డైరెక్టర్ ఎవరు? అజిత్ దోవల్ జీవితంలోని ఏ భాగంతో ఈ సినిమా తెరకెక్కనుంది అనే అంశాలు తెలియాల్సి ఉంది.