కోలీవుడ్ లో సెటిల్ అవ్వడం గ్యారెంటి

ప్రస్తుతం గోపీచంద్ – మారుతి కాంబినేషన్ లో రూపొందుస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో హీరోయిన్ నటిస్తోంది రాశి ఖన్నా. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే అక్కినేని నాగ చైతన్య – విక్రం కె కుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న థాంక్యూ సినిమాలో కూడా రాశి నటిస్తోంది. హిట్ గ్యారెంటి అని అభిమానులు ఫీల్ అవుతున్న ఈ రెండు ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న రాశి ఖన్నా, ఇప్పుడు కోలీవుడ్ లో పాగా వేయడానికి ప్లాన్ చేస్తోంది.

ప్రస్తుతం రాశిఖన్నాకి తెలుగు కంటే తమిళంలో భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. దాదాపు 6 తమిళ సినిమాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు అక్కడ స్టార్ డమ్ తెచ్చుకునేందుకు గ్లామర్ ట్రీట్ కూడా బాగానే ఇస్తోందట. తమిళ తంబీలకు బొద్దుగుమ్మలంటే బాగా క్రేజ్ ఉంటుంది. వాళ్లని అలాగే తన కోలీవుడ్ కెరీర్‌ని దృష్ఠిలో పెట్టుకొని అక్కడ గ్లామర్ అండ్ రొమాంటిక్ రోల్స్ కి సై అంటోంది. ఈ క్రమంలో రాశిఖన్నా తాజాగా నటించిన కోలీవుడ్ మూవీ ఆరణ్మయి 3. ఇందులో త్రిష – హన్సికలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. ఆర్యకి జంటగా నటించిన రాశికి ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు.