సునీత పెళ్లి‌లో అదే హైలెట్

టాలీవుడ్ పాపులర్ సింగర్ సునీత రెండో పెళ్లి నిరాడంబరంగా జరిగింది. మ్యాంగోమూవీస్ అధినేత రామ్ వీరపనేనిని సునీత పెళ్లాడింది. కరోనా ప్రభావం క్రమంలో కొంతమంది సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లోని అమ్మపల్లి సీతారామచంద్రస్వామి టెంఫుల్‌లో వీరి పెళ్లి జరిగింది. సన్నిహితులు, బంధువులు ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

SUNITHA MARRIAGE

పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. అంతకుముందు జరిగిన మెహందీ ఫంక్షన్‌లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్‌తో పాటు యాంకర్ సుమలు పాల్గొని సందడి చేశారు. సుమ, రేణూదేశాయ్ కలిసి సునీతను పెళ్లి కూతురిని చేశారు. ఇక ఈ పెళ్లిలో సునీత కుమారుడు, కుమార్తె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వచ్చిన బంధువులు, స్నేహితులను ఆహ్వానించడం దగ్గర నుంచి పెళ్లి పనులన్నీ వారిద్దరే చూసుకున్నారు.

ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సునీతకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.