కోలీవుడ్ హీరో నుంచి సందీప్ కిషన్ కి కొత్త తలనొప్పి…

చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూసిన సందీప్ కిషన్, రీసెంట్ గా హిట్ ట్రాక్ ఎక్కాడు. సక్సస్ ని కంటిన్యూ చేయడానికి నాగేశ్వర్ రెడ్డితో కలిసిన సందీప్, తెనాలి రామకృష్ణ సినిమా చేశాడు. హన్సిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకోని నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యింది. అయితే ఈ తెనాలి రామకృష్ణకి విశాల్ యాక్షన్ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

sandeep kishan

మొదటి సినిమా నుంచి తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న విశాల్, తమన్నా జంటగా సుందర్ సి డైరెక్షన్లో తెరకెక్కిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యాక్షన్’. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ మూవీని కూడా నవంబర్ 15 వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. టీజర్, ట్రైలర్ మెప్పించడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి, దీంతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా యాక్షన్ సినిమా భారీగానే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మేకింగ్ పరంగా ఎలాగూ బాగుంటుందని ట్రైలర్ తోనే ప్రూవ్ చేశారు కాబట్టి కంటెంట్ కూడా బాగుంటే, అదే రోజున రిలీజ్ అవుతున్న తెనాలి రామకృష్ణ సినిమాకి దెబ్బ పడే ఛాన్స్ ఉంది. ఈ మూవీనే కాకుండా తెనాలి రామకృష్ణకి రాగాల 24 గంటల్లో సినిమా నుంచి కూడా పోటీ ఎదురవుతుంది. మరి ఈ రెండు సినిమాలని తట్టుకోని సందీప్ కిషన్ హిట్ ఇస్తాడేమో చూడాలి.