ఎన్టీఆర్ దర్శకుడితో అక్కినేని కుర్రాడి సినిమా…

ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్న ఎన్టీఆర్, తర్వాత కొరటాల శివతో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఎన్టీఆర్ సినిమా అవగానే కొరటాల శివ అక్కినేని అఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ప్రాజెక్ట్ ని సెట్ చేయడానికి కింగ్ నాగ్ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

కొరటాల శివ సినిమా అంటే హిట్ గ్యారెంటీ అనే మాట ఇండస్ట్రీలో ఉంది కాబట్టి అఖిల్ కాంబో సెట్ చేస్తే, హిట్ కొట్టొచ్చు అనే లెక్కలు వేస్తున్నారు. ఇప్పటికే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. అఖిల్ చేస్తున్న ఈ రెండు ప్రాజెక్ట్స్ కి కొరటాల శివ కూడా కలిస్తే అక్కినేని కుర్రాడి మార్కెట్ అమాంతం పెరిగే అవకాశం ఉంది.