సేతుపతి క్రేజ్ అంటే ఆ మాత్రం ఉండాలిగా…

ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో ఎవరైనా ఉన్నారా అంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అనే చెప్పాలి. తన యాక్టింగ్ తో ఎలాంటి పాత్రని అయినా ఈజ్ తో చేసే సేతుపతికి పట్టిందల్లా బంగారమే అవుతోంది. హీరో, విలన్, సపోర్టింగ్ రోల్… ఇలా ఎలాంటి పాత్ర చేసినా విజయ్ సేతుపతి ఉన్నాడు అంటే ఆ మూవీ పక్కా హిట్ అనే నమ్మకం కలిగించాడు. బిగ్ స్క్రీన్ పైన ఆకాశం అంత స్టార్ డమ్ సొంతం చేసుకున్న సేతుపతి, ఇప్పుడు బుల్లితెర మీద కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్ లాంగ్వేజస్ లో భారీ సినిమాలని చేస్తున్న మక్కల్ సెల్వన్, త్వరలో హోస్ట్‌గా అవతారం ఎత్తనున్నాడు.

ఇంటర్‌నేషనల్ లెవల్‌లో సూపర్ హిట్ అయిన మాస్టర్ చెఫ్ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా విజయ్‌ సేతుపతి వ్యవహరించబోతున్నాడు. ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న విజయ్‌ సేతుపతి ఈ టెలివిజన్‌ షో కోసం అంతకన్నా భారీగానే ఛార్జ్ చేస్తున్నాడట. సన్ టీవీలో ప్రసారం కాబోతున్న ఈ షోకు సంబంధించి టీజర్‌ కూడా రిలీజ్ అయ్యింది. తనదైన స్టైల్ లో షో గురించి చెప్పిన సేతుపతి, అందరూ టేస్ట్ చేయడానికి రెడీగా ఉండండి అంటూ టీజర్ ని ముగించాడు. టీజర్ బాగుంది మరి తన మార్క్ ఈజ్ తో సేతుపతి హోస్ట్ గా ఎంత అలరిస్తాడో చూడాలి.