శ్రీ‌విష్ణు కొత్త సినిమాకు క్లాప్ కొట్టిన నారా రోహిత్‌

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ‌విష్ణు ఎంతో ప్ర‌తిభ ఉన్న న‌టుడు. 2009లో నారా రోహిత్ హీరోగా తెర‌కెక్కిన బాణం సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యాడు. అప్ప‌టినుంచి సోలో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇలా ప‌లు సినిమాల్లో త‌న ప్ర‌తిభ‌ను క‌నబ‌రిచి త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాగే శ్రీ‌విష్ణు హీరోగా.. అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు, నీది నాది ఒకే క‌థ‌, మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా అనే సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. ఇటీవ‌లే విడుద‌లైన తిప్ప‌రామీసం సినిమాతో నిరావ‌ప‌రిచాడు.

sri vishnu movie

త‌న నుంచి అభిమానులు ఆశించే కొత్త‌ద‌నాన్ని ప‌క్క‌న‌పెట్టి రొటీన్ ఫార్ములాతో ఈ సినిమాను చేసి నిరాశ‌ప‌రిచాడు. ఇక ప్ర‌స్తుతం శ్రీ‌విష్ణు వ‌రుస సినిమాల‌కు ఓకే చెప్తూ జోరు మీద ఉన్నాడు. నేడు త‌న కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాగా.. ఈ సినిమాకు నారా రోహిత్ క్లాప్ కొట్టి మొద‌లుపెట్టాడు. ఈ చిత్రాన్ని ప్ర‌దీప్ వ‌ర్మ అల్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. శిరీష్ ఈ సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు డ్రామాతో ఈ చిత్ర క‌థ‌లో వైవిధ్యంగా సాగుతుంద‌ని. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు తెలిపారు.