ధ‌నుష్ కొత్త సినిమా షూరూ..

కోలివుడ్‌స్టార్ ధ‌నుష్ వ‌రుస సినిమాల‌తో బిజీబిజీగా ఉన్నాడు. ఒకవైపు తమిళంలో సినిమాలు చేసున్న మ‌రోవైపు బాలీవుడ్‌, హాలీవుడ్ ప్రాజెక్ట్‌ల‌ను ధ‌నుష్ చేస్తున్నాడు. ఇక త‌మిళ ఇండ‌స్ట్రీలో ధ‌నుష్ అంటే ఒక మాస్ హీరో.. ధ‌నుష్ సినిమా వ‌స్తోందంటే త‌న అభిమానుల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంటాయి. ధ‌నుష్ త‌మిళ్‌తో పాటు తెలుగు, హిందీ ప‌లు భాష‌ల్లో ప్రేక్ష‌కుల్లో గుర్తింపు సంపాదించుకున్నారు.

dhanush new movie start

దీంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ధ‌నుష్‌. ఇదిలాఉంటే.. ధ‌నుష్ డి43 సినిమా గురించి ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు త‌న అభిమ‌నులు. ఈ నేప‌థ్యంలోనే డి43 సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాగా.. క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ కార్తిక్‌న‌రేశ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌నున్నాడు. సిన‌మా క‌థ థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ని, ధ‌నుష్ పాత్ర ఈ సినిమాలో డిఫరెంట్‌గా ఉంటుంద‌ని చిత్ర‌బృందం తెలిపారు. ఈ ఏడాది చివ‌ర‌లోఈ సినిమా రాబోతుంద‌ని స‌మాచారం కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్ర‌కాశ్ సంగీతాన్ని అందిస్తున్నారు.