ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్స్ క‌లిసిన వేళ‌..

మోహ‌న్‌లాల్‌, మ‌మ్ముట్టి మ‌ల‌యాళంలో బిగ్ సూప‌ర్‌స్టార్ హీరోలు అనే విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ సినీ ప‌రిశ్ర‌మ‌లో వీరిద్ద‌రూ సుదీర్ఘ కాలం పాటు విజ‌య‌వంతంగా ఎన్నో సినిమాల్లో న‌టించారు. ఇప్ప‌టికి కూడా వీరు సూప‌ర్‌స్టార్‌ల‌ని అక్క‌డి అభిమానులు చెబుతుంటారు. వీరు మ‌ల‌యాళంతో పాటు తెలుగు, హిందీ, త‌మిళ్ భాష‌ల్లో న‌టించి అక్క‌డి ప్రేక్ష‌కుల్లో కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇంత‌టి పేరున్న వీరిద్ద‌రూ క‌లిసి క‌నిసిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుందో.. వీరి అభిమానుల్లో సంతోషాల‌కు అవ‌ధులు లేకుండా ఏర్ప‌డ‌తాయి.

mohanlal and mammutti

తాజాగా ఆ సంఘ‌ట‌న జ‌రిగింది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఈ ఇద్ద‌రు సూప‌ర్‌స్టార్‌లు పాల్గొన్నారు. ఈ కార్యాక్ర‌మంలో వీరిద్ద‌రు ఎంతో స్నేహంగా ఉన్నారు. దీంతో సోష‌ల్‌మీడియాలో కాస్త వైర‌ల్‌గా మారాయి ఈ ఫోటోలు. ఇద్దరు కూడా ఇలా క‌నిపించ‌డం ప‌ట్ల వీరి అభిమానులు కాకుండా సినీ అభిమానులు వావ్ అంటున్నారు. అలాగే వీరిద్ద‌రు క‌లిసి ఒక సినిమాలో న‌టిస్తే అద్భుతం అన్న‌ట్లుగా ఈ ఫోటో ఉంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ పెడుతున్నారు.