దర్శకేంద్రుడి మరో పెళ్లి సందడి.. హీరోగా శ్రీకాంత్ తనయుడు

1996లో వచ్చిన పెళ్లి సందడి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది. కేవలం పాటల ద్వారానే ఆ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. అనంతరం సినిమా చూశాక దర్శకేంద్రుడి మేకింగ్ శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటన సినిమా స్థాయిని మరింత పెంచాయి.

అయితే మళ్ళీ 24ఏళ్ళ అనంతరం అదే కాన్సెప్ట్ లో దర్శకుడు కె. రాఘవేంద్రరావు పెళ్లి సందD అంటూ ఒక రొమాంటిక్ మ్యూజికల్ ప్రాజెక్టును సెట్ చేసుకున్నారు. ఇటీవల సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన ఆయన త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తానని అన్నారు. ఇక ఆ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించే అవకాశం ఉందట. హీరోయిన్ కొత్త అమ్మాయిని సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రోషన్ ఇదివరకే నిర్మల కాన్వెంట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇప్పుడు రెగ్యులర్ హీరోగా బిజీ అవ్వాలని రాఘవేంద్రరావు పెళ్లి సందడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.