శివగామి రెమ్యునరేషన్ హీరోయిన్స్ కంటే ఎక్కువే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు హీరోయిన్స్ నెంబర్ వన్ స్థానం అనేది మారుతూ ఉంటుంది. టాప్ హీరోయిన్ గా రెమ్యునరేషన్ కోటిన్నర అందుకునే హీరోయిన్స్ ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అందులో పూజా హెగ్డే, రష్మీక మందన్న లీడ్ లో కొనసాగుతున్నారు. అయితే హీరోయిన్స్ కంటే హై రేంజ్ లో టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ డిమాండ్ రోజురోజుకు ఎక్కువవుతోంది.

ఆమె చేస్తున్నది సపోర్టింగ్ రోల్స్ అయినప్పటికీ రోజుకి 10లక్షల వరకు అందుకుంటోంది. కొన్నిసార్లు ప్రాజెక్టును బట్టి హెచ్చుతగ్గులు కూడా ఉంటాయట. ఇక పది లక్షల వరకు డిమాండ్ చేసే రమ్యకృష్ణ 10రోజుల కాల్షీట్స్ ఇచ్చినా కూడా లెక్క కోటి వరకు ఈజీగా దాటుతుంది. ఇటీవల తమిళ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో నటించిన శివగామి తన రేంజ్ ని మరింత పెంచుకుందనే చెప్పాలి. ప్రస్తుతం రమ్యకృష్ణ వినయ్ దేవరకొండ ఫైటర్ సినిమాతో పాటు సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ సినిమాలో నటిస్తోంది.