సింగిల్ థియేటర్ల మూసివేత?

ప్రస్తుతం సినిమాలు తక్కువగా ఉన్న కారణంగా సినిమా ఇండస్ట్రీకి చాల ఇబ్బందిగా మారింది. మల్టీప్లెకస్ లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాలలో కలిపి 2000 కు పైగా సింగిల్ థియేటర్లు, సుమారు 100 మల్టీప్లెక్స్ లు ఉండగా ప్రస్తుతానికి 10 రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసివేసే ఆలోచనలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లు సమాచారం. సినిమాలు తక్కువగా ఉన్న ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే మళ్ళీ 10 రోజుల తరువాత ఈ సింగిల్ థియేటర్ల తెరిచివేత ఉంటుందా, లేదా సజావుగా సినిమాలు వచ్చే వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసి ఉండాల్సిందేనా అనేది వేచి చూడాలి. ఈ చర్చలు జరిగి డిస్ట్రిబ్యూటర్ సంఘం నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇంకా అఫిషియల్ గా బయటకి ఈ వార్త రాలేదు. దీనికి సింగిల్ థియేటర్ల ఓనర్స్లు ఒప్పుకుంటారా లేదా అనేది వేచి చూడాలి!