నటుడు ప్లాస్టిక్ సర్జరీ – చివరికి ఏమైంది!!!

సినిమా ఇండస్ట్రీలో అందంగా కనిపించడం కోసం కొంత మంది నటీనటులు కొన్ని సర్జరీలు చేయించుకుంటారు. అది అందరికి తెలిసిన విషయం అయినప్పటికీ చాలా మంది బయటకి చెప్పుకోరు. అయితే ఆ సర్జరీ జాబితాలో కొందరు స్టార్ హీరో హీరోయిన్లు కూడా ఉన్నారు. కానీ బాలీవుడ్ కు చెందిన నటి త్రినేత్ర హల్దార్ గుమ్మరాజు ఆలా కాదు. తాను చేయించుకున్న సర్జరీని తానే బహిర్గతం చేసుకుంది. తాను అందంగా కనిపించేందుకు ఈ సర్జరీ చేయించుకున్నాను అంటూ తన ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా బయట పెట్టగా ఇంటర్నెట్ లో ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ గా మారాయి. డాక్టర్ కావడానికి గాను ఎంబీబీఎస్ చదువుతుండగా తనకి ఉన్న అమ్మాయి లక్షణాలను గ్రహించి, అప్పటి వరుకు అబ్బాయిగా ఉన్న తాను 2018లో 20 సంవత్సరాల వయసులో ట్రాన్స్ జెండర్ గా మారింది. తెలుగు, బెంగాలీ కుటుంబానికి చెందిన ఈమెకు తన కుటుంబం అండగా నిలిచింది.