కాంచన రీమేక్.. లక్ష్మీ బాంబ్ హిట్టయితే ముని సీక్వెల్ కూడా..

సౌత్ మల్టిటాలెంటెడ్ టెక్నీషియన్ రాఘవ లారెన్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఒక డ్యాన్స్ మాస్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత హీరోగా దర్శకుడిగా మ్యూజిక్ డైరెక్టర్ గా తన టాలెంట్ ని మరింత పెంచుకున్నాడు. అంతే కాకుండా కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేసే గొప్ప మానవత్వం ఉన్న మనిషిగా జనాల హృదయాలకు దగ్గరయ్యాడు. అయితే మొదటిసారి లారెన్స్ బాలీవుడ్ లో దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

అక్షయ్ కుమార్ తో చేసిన లక్ష్మీ బాంబ్ కాంచన సినిమాకు రీమేక్ గా తెరకెక్కిక విషయం తెలిసిందే. అయితే ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్న ఆ సినిమా ట్రైలర్ ని ఇటీవల రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేశారు. సినిమా ఒరిజినల్ కథకు కాస్త భిన్నంగా ట్రై చేసినట్లు అర్ధమవుతోంది. హీరోయిన్ బ్యాక్ డ్రాప్ లో కథను మార్చిన లారెన్స్ అక్షయ్ కుమార్ ని రెండు విభిన్నమైన పాత్రలలో చూపించబోతున్నారు. ఇక ఈ హారర్ కామెడీతో లారెన్స్ బాలీవుడ్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ హిట్టయితే గనక ఆ తరువాత ముని సీక్వెల్స్ కూడా అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ తరహలోనే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.