బాల‌య్య సినిమాలో విల‌న్‌గా సీనియ‌ర్ టాలీవుడ్ హీరో

బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌స్తున్న సినిమాలో హీరో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించ‌నున్నాడు. సంజయ్ దత్, వివేక్ ఒబేరాయ్‌ల‌తో పాటు పలువురు నటులను విలన్ పాత్ర కోసం సినిమా యూనిట్ సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ చివ‌రికి శ్రీకాంత్‌ను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ప‌లు సినిమాల్లో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించాడు. దీంతో బాల‌య్య సినిమాలో శ్రీకాంత్ విల‌న్ అయితే బాగుంటుంద‌ని సినిమా యూనిట్ భావించిన‌ట్లు వార్త‌లొచ్చాయి.

లాక్‌డౌన్ వ‌ల్ల ఆగిపోయిన బాల‌య్య‌-బోయ‌పాటి సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. షూటింగ్ స్టార్ట్ అయిన త‌ర్వాత శ్రీకాంత్ విలన్ పాత్ర‌లో న‌టిస్తాడ‌నే విష‌యాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది. బాల‌య్య‌, శ్రీకాంత్ గ‌తంలో క‌లిసి ప‌లు సినిమాల్లో న‌టించారు. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. త్వ‌ర‌లో రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో శ్రీకాంత్ కూడా పాల్గొననున్నాడ‌ని తెలుస్తోంది.

బాల‌య్య‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో గ‌తంలో వ‌చ్చిన సింహా సినిమాలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించిన విష‌యం తెలిసిందే. ఆ సినిమాతో అప్ప‌టివ‌ర‌కు హీరోగా కొన‌సాగిన జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా మారారు. ఆ సినిమాకు గాను జ‌గ‌ప‌తిబాబుకు మంచి పేరు వ‌చ్చింది. ఇప్పుడు మ‌రి బాల‌య్య సినిమాలో శ్రీకాంత్ విల‌న్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.