అభిజిత్ అలాంటి వాడు.. గుట్టు రట్టు చేసిన అమల

యంగ్ హీరో, బిగ్‌బాస్ కంటెస్టెంట్ అభిజిత్ ఇప్పుడు బాగా పాపుల‌ర్ అయ్యాడు. బిగ్‌బాస్ షోతో అత‌డి ఇమేజ్ బాగా పెరిగిపోయింది. అంత‌కుముందు చాలామందికి అభిజిత్ అంటే తెలియ‌దు. కానీ బిగ్‌బాస్‌షోలో పాల్గొన‌డంతో అత‌డి పేరు అంద‌రికీ తెలిసిపోయింది. బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్నాడు అభిజిత్. ప్ర‌తివారం నామినేష‌న్‌లో ఉన్నా.. ఎప్పుడూ సేవ్ అవుతూనే ఉన్నాడు. ప్రేక్ష‌కులు అభిజిత్‌కు ప్ర‌తివారం ఓట్లు వేస్తూనే ఉన్నారు.

గతంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిపుల్’ సినిమాలో అభిజిత్ అమ్మ పాత్రలో అమల నటించింది. అమ్మ పాత్రలో అమల నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాలో కలిసి నటించడంతో అమలకు అభిజిత్ బాగా తెలుసు. దీంతో తాజాగా అభిజిత్‌ గురించి అమల ఆసక్తి విషయాలు బయటపెట్టింది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా షూటింగ్ సమయంలో అభిజిత్ చాలా చిన్నవాడని, పెద్దలతో ఎంతో మర్యాదగా ప్రవర్తించేవాడని తెలిపింది.

అభిజిత్ తనకు కొడుకు లాంటి వాడని, బిగ్‌బాస్‌లో చాలా మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నాడని అమల చెప్పింది. షూటింగ్ సమయంలో అభిజిత్ తనను అమ్మలాగే చూసుకున్నాడని అమల తాజాగా చెప్పింది.