తాప్సికి బిగ్ ఆఫర్ ఇచ్చిన షారూఖ్ ఖాన్

ప్రముఖ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నిర్మిస్తున్న సినిమాలో తాప్సి, కార్తీక్ ఆర్యన్‌కు అవకాశం దక్కినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇంకా బయటికి రాలేదు. అయితే ఈ సినిమాలో నటించేందుకు తాప్సి, కార్తీక్ ఆర్యన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రెడ్ చిలీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో ప్రొడక్షన్స్ హౌస్‌ను మొదలుపెట్టిన షారూఖ్.. నిర్మాతగా మారి వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన బ్యానర్లపై అనేక సినిమాలు రూపుదిద్దుకున్నాయి.

గతంలో షారూఖ్ ఖాన్ బ్యానర్ నుంచి వచ్చిన ‘బడ్లా’ సినిమాలో తాప్సి నటించగా.. ఇందులో బిగ్‌బి అమితాబ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఇటీవల షారూఖ్ ఖాన్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ది క్లాస్ ఆఫ్ 83’ అనే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. బాబీ డియోలో ఆ సినిమాలో కీలక పాత్రలో నటించారు.

2018లో విడుదలైన ‘జీరో’ సినిమా తర్వాత ఎటువంటి సినిమా షారూఖ్ చేయలేదు. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ఒకవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు నిర్మాతగా సినిమాలు రూపొందిస్తున్నాడు.