‘క్రాక్’ రీమేక్‌లో హీరోగా సోనూసూద్?

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’ సినిమా సంక్రాంతి కానుకగా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు నడుస్తున్న క్రమంలో కూడా ‘క్రాక్’ సినిమా భారీ కలెక్షన్లను సంపాదించుకుంటోంది. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమాలోని యాక్షన్ సీన్లు మరింతగా అలరించాయి.

sonusood hindhi remake

అయితే ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ నటుడు సోనూసూద్ దీనిని బాలీవుడ్‌లోకి రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని, ఇందులో సోనూసూద్ హీరోగా నటించనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసేందుకు క్రాక్ నిర్మాత ఠాగూర్ మధుతో సోనూసూద్ చర్చలు జరుపుతున్నాడట. ఇప్పటికే కొత్తగా ఒక బ్యానర్‌ను సోనూసూద్ ఏర్పాటు చేశాడు. ఆ బ్యానర్‌పై ఈ సినిమా తీసే అవకాశముంది.