ఆచార్యలో చరణ్ పాత్ర గురించి బయపెట్టిన కొరటాల

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతుండగా.. ఇందులో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కీలక పాత్రలలో నటించనున్నాడు. ఇందులో రాంచరణ్‌ది గెస్ట్ రోల్ అని గతంలో వార్తలు రాగా.. గెస్ట్ రోల్ కాదని, ఫుల్ లెన్త్ అని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై డైరెక్టర్ కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు.

koratala siva about charan

ఆచార్యలో చరణ్‌ది పవర్‌ఫుల్ క్యారెక్టర్ అని, ఫుల్ లెంత్‌ రోల్ అని ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ బయటపెట్టాడు. చిరు, చరణ్‌లను కలిపి డైరెక్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని, వారిని ఒకే ఫ్రేమ్‌లో చూపించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నానని కొరటాల చెప్పాడు. ఇద్దరు కాంబోలో వచ్చే సీన్లు గూస్బమ్స్ తెప్పిస్తాయని, చిరు, చరణ్‌లతో ఒక సాంగ్ కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం.