ఆ హీరోతో పెళ్లికి నాన్న ఒప్పుకోలేదన్న కాజోల్

బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దేవగణ్ నటించిన త్రిభంగ్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కాజోల్ పాల్గొంటోంది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలను కాజోల్ బయటపెట్టింది. తాను హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలో 24 ఏళ్ల వయస్సుల్లో అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకుంటానని తన తండ్రికి చెప్పానంది.

kajol revels about marraige

కానీ తన తండ్రి పెళ్లికి ఒప్పుకోలేదని, తల్లి మాత్రం పెళ్లికి ఒప్పుకుందని కాజోల్ చెప్పింది. ఆ తర్వాత అజయ్ దేవగణ్‌ను పెళ్లి చేసుకున్నానని, ఈ విషయంలో చుట్టుపక్కల వారి మద్దతు లభించిందని కాజోల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం లైఫ్‌లో హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చింది.