క‌నుమ పండుగ సంద‌ర్భంగా గోమాత‌ల‌తో ప‌వ‌ర్‌స్టార్‌..

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌నుమ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని త‌న వ్య‌వ‌సాయ క్షేత్రాన్ని సంద‌ర్శించారు. ఆ క్షేత్రంలో గోవుల‌తో క‌నుమ వేడుక‌లు నిర్వ‌హించారు. గోవుల‌ను అక్క‌డి సిబ్బంది పూల‌తో అలంక‌రించగా. ఆ పై ప‌వ‌న్ ఆ గోవుల‌కు న‌మ‌స్క‌రించి వాటికి పండ్లు, ఇత‌ర ఆహారం అందించారు. గోమాత‌లు ఆహారం స్వీక‌రంచ‌డాన్ని ఆయ‌న ఆస‌క్తిగా తిల‌కించారు. ఇదిలాఉంటే.. సంక్రాంతి అంటే ఒక్క‌రోజు జ‌రుపుకునే పండుగ కాదు..

powerstar with cows

మూడు రోజులు ఫ్యామిలీ అంతా క‌లిసి సంతోషంగా చేసుకుంటారు. మొద‌టి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, ఇక మూడో రోజు క‌నుమ‌. పంట చేతికి రావ‌డానికి రైతులు చాలా క‌ష్ట‌ప‌డ‌తారు.. ఇక వ్య‌వ‌సాయంలోనే కాకుండా పాడి ద్వారా కూడా గోమాత‌లు రైత‌న్న‌ను ఆర్థికంగా ఆదుకుంటాయి. ఇలా త‌మ సంప‌ద‌ల‌కూ, సంతోషాల‌కూ కార‌ణ‌మైన కృత‌జ్ఞ‌త‌తో పూజించ‌డ‌మే క‌నుమ పండుగ ముఖ్య ఉద్దేశం.. అందుకే క‌నుమ రోజును ప‌శువుల పండుగ అంటారు.