మెగా అభిమానులకు రేపు పండగే పండగ

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా రేపు థియేటర్లలో విడుదల అవుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో విడుదల అవుతున్న పెద్ద హీరో సినిమా ఇదే కావడంతో దీనిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా హిట్ అయితే మరిన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యే అవకాశముంది. ఒకవేళ ఈ సినిమా ప్లాప్ అయితే థియేటర్లలో సినిమాలను విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు భయపడే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

solo bratikey so betre

ఈ సినిమా రిజల్ట్‌ని బట్టే మిగతా దర్శక, నిర్మాతలు థియేటర్లలో సినిమా విడుదల చేయడంపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీంతో ఈ సినిమా హిట్ కావాలని హీరో మహేష్ బాబుతో పాటు విజయ్ దేవరకొండ, పలువురు హీరోలు సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. కొత్త డైరెక్టర్ సుబ్బు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఇందులో హీరోయిన్‌గా నటించింది.

తమన్ సంగీతం అందించగా.. శ్రీ వెంకటేశ్వర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. సింగిల్‌గా ఉంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే కథతో ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ తర్వాత విడుదల అవుతున్న ఈ సినిమా హిట్ కావాలని మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మోగా హీరో సినిమా విడుదల అవుతుండటంతో.. మెగా అభిమానులు అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు.