గుండెపోటుతో ప్రముఖ డైరెక్టర్ మృతి

భారతీయ సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను కరోనా బలి తీసుకోగా.. కొంతమంది అనారోగ్యంతో మృతి చెందారు. తాజాగా మలయాళ సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డైరెక్టర్, రచయిత నరన్​పుల సన్వాస్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మృతి చెందారు. ఆయన మృతితో మలయాళ సినిమా పరిశ్రమ దిగ్భాంతికి గురి అయింది.

naranipuzha shanavas

పలువురు సినిమా ప్రముఖులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. నరన్​పుల సన్వాస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వయస్సు 40 సంవత్సరాలు. ప్రస్తుతం ‘గాంధీరాజన్’ అనే సినిమా చేస్తుండగా.. గత వారం ఈ షూటింగ్ ప్రారంభమైంది. ఈ షూటింగ్ సెట్లోనే హఠాత్తుగా నవ్వాస్‌కు గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్న సమయంలో బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు.

తొలి సినిమా ‘కరీ’తో డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు సవ్వాస్. రెండో సినిమాగా ‘సూఫియం సుజాతయుం’ రాగా.. జులైలో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదలైంది.