సోలో బ్రతుకే టాలీవుడ్ డైరెక్టర్ సుబ్బు తల్లి మృతి…

కరోనా సెకండ్ వేవ్ మన చుట్టూ ఉండే ఎంతోమందిని బలి తీసుకుంటుంది. ఈరోజు బాగున్న వాళ్లు రేపు బ్రతికుంటున్నారో కూడా తెలియని పరిస్థితి వచ్చింది. లక్షల్లో కేసులు వేళల్లో మరణాలు ఇది కరోనా మనకి ఇస్తున్న శిక్ష. సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేకుండా కరోనా అందరినీ కబళిస్తుంది. తాజాగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా దర్శకుడు సుబ్బు, అమ్మగారు మరణించారు.

కొడుకు మొదటి సినిమాకే టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటే మంగమ్మ గారు మాత్రం అతని సక్సస్ చూడకుండానే మరణించారు. మొదట హోమ్ ఇసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న మంగమ్మ గారిని ఆదివారం రోజున పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ హాస్పిటల్ లో టైంకి ఐసీయూ బెడ్ దొరకకపోవడంతో ఆమె మరణించినట్లు తెలుస్తుంది. కాపాడుకోగలిగినంత డబ్బు ఉన్నా వసతులు లేక మనకి కావాల్సిన వాళ్లని దూరం చేసుకోవడం బాధాకరం.