రేపు జరగబోయేది మీరు ఊహించలేరు…

ది ఫ్యామిలీ మ్యాన్… ఇండియాస్ ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ ఓన్ కంటెంట్. ఇంగ్లీష్ సిరీస్ ల హవా నడుస్తున్న టైములో ఫామిలీ మ్యాన్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ నుంచి బయటికి వచ్చి ఇండియా వైడ్ సూపర్ హిట్ అయ్యింది. మనోజ్ బాజ్పాయ్, ప్రియమణి నటించిన ఈ సిరీస్ తో మన మేకింగ్ స్టాండర్డ్స్ ఏంటో ఇంటర్నేషనల్ వైడ్ తెలిసేలా చేశారు రాజ్ అండ్ డీకే. ఒక సిరీస్ లో ఫస్ట్ సీజన్ హిట్ అయితే ఇంకో సీజన్ కోసం వెయిట్ చేయడం కామనే కానీ ది ఫ్యామిలీ మ్యాన్ విషయంలో వెయిటింగ్ మాత్రమే కాదు సెకండ్ సీజన్ కోసం అందరూ డైయింగ్ కూడా. అంతలా ఎందుకు అనుకుంటున్నారా? కాస్టింగ్ లో మనోజ్ బాజ్పాయ్, ప్రియమణిలకి స్టార్ హీరోయిన్ సమంత కలవడమే.

టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత చేస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. టెర్రరిస్ట్ పాత్రలో కనిపించనున్న సామ్, ఇండియా వైడ్ తన టాలెంట్ ని ప్రూవ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎప్పుడో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న సెకండ్ సీజన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్లందరినీ ఇప్పటివరకూ ఊరిస్తూ వచ్చిన మేకర్స్ ఫైనల్ గా రేపు ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన అమెజాన్ ప్రైమ్, సమంత మనోజ్ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసింది. రేపు జరగబోయేది మీరు ఊహించలేరు అంటూ బయటకి వచ్చిన ఈ పోస్ట్, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లెట్స్ సి వాట్ ది మేకర్స్ ఆర్ ఆఫరింగ్ విత్ ది ట్రైలర్.