వెంకటేష్ చేయాల్సిన సినిమాలో శర్వానంద్

సినిమా ఇండస్ట్రీలో ఒకరి కోసం అనుకున్న కథ మరొక హీరో వద్దకు వెళ్లడం నిత్యం జరుగుతూ ఉండేదే. దాదాపు ప్రీ ప్రొడక్షన్ లోకి వెళ్లిన కథలు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి మరో హీరోను వెతుక్కున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ చేయాలని అనుకున్న ఒక సినిమా కథ కూడా అదే విధంగా మరొక హీరో వద్దకు చేరినట్లు తెలుస్తోంది.

నేను శైలజా, చిత్రాలహరి వంటి ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల గతంలో వెంకీతో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. ఇక ప్రస్తుతం రామ్ తో రెడ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ గోల లేకపోయినా ఉంటే ఈపాటికే రెడ్ సినిమా రిలీజ్ అయ్యి ఉండేది. అసలు మ్యాటర్ లోకి వస్తే.. నెక్స్ట్ ఈ దర్శకుడు శర్వానంద్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

గతంలో కిషోర్.. వెంకటేష్ కోసం అడళ్లు మీకు జోహార్లు అనే కథను రాసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ వెంకీతో సెట్టవ్వకపోవడంతో శర్వానంద్ కి షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. శర్వా స్టామినాకు తగ్గట్లుగా దర్శకుడు మళ్ళీ కథను సరికొత్తగా రెడీ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.