RGV పవర్ స్టార్ సినిమాపై పవన్ కళ్యాణ్ షాకింగ్ రియాక్షన్

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే అనేలా ప్రస్తుతం సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు హాట్ మసాలా సినిమాలతో కాస్త హడావుడి చేసిన RGV ఇప్పుడు సడన్ గా పవన్ కళ్యాణ్ వైపు తిరగడం హాట్ టాపిక్ గా మారింది. గ్యాప్ లేకుండా సినిమాలతో బిజీగా ఉన్న వర్మ త్వరలో పవర్ స్టార్ అనే సినిమాను విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

రెగ్యులర్ పవర్ స్టార్ కి సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేస్తూ వైరల్ అయ్యేలా చేస్తున్న వర్మ నెటీజన్స్ నుంచి ఉహీంచని స్పందనను అందుకుంటున్నాడు. అయితే వర్మ పవర్ స్టార్ పోస్టర్స్ పవన్ కళ్యాణ్ వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ పోస్టర్స్ చూసిన పవన్ తనలో తానే నవ్వేసుకున్నారట. ఇక ఎక్కువ సేపు ఆ విషయం గురించి ఆలోచించకుండా వదిలేశారట. అదే విదంగా RGV డోస్ ఎంత పెంచిన కూడా స్పందించడానికి పవన్ ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం.