యువ హీరో కోసం ప్రభాస్ ఆర్డర్.. సిద్దమైన యూవి క్రియేషన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మంచి మిత్రుడు ఎవరు అంటే వెంటనే ప్రభాస్ పేరు గుర్తొస్తోంది. ప్రభాస్ కి ఒక్కసారి దగ్గరైతే అంత ఈజీగా మనుషులను వధులుకోడని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అదే విధంగా తన వరకు తోచినంత సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. ఇక తన కెరీర్ కి యూ టర్న్ ఇచ్చిన దర్శకుడి తనయుడి కోసం ప్రభాస్ ఒక ఆర్డర్ వేశాడు.

అందుకు యూవీ క్రియేషన్స్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ కి యూ టర్న్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా దర్శకుడు శోభన్ 2008లో గుండెపోటుతో మరణించాడు. అయితే ఆ తరువాత శోభన్ కుమారుడు సంతోష్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. గోల్కొండ హై స్కూల్ తరువాత తను నేను, పేపర్ బాయ్ అనే సినిమాలు చేశాడు.

శోభన్ గురించి తెలుసుకున్న ప్రభాస్ పేపర్ బాయ్ సినిమా సమయంలోనే ప్రమోషన్స్ పరంగా కాస్త సహాయం అంధించాడు. ఇక ఇప్పుడు తన హోమ్ ప్రొడక్షన్ యూవీ క్రియేషన్స్ లో రెండు సినిమాలకు సైన్ చేయించినట్లు తెలుస్తోంది. కేవలం తన ఒక్కడికే కాకుండా మిగతా హీరోలకు కూడా అవకాశం కల్పించేలా ప్రభాస్ యూవీ క్రియేషన్స్ ని మారుస్తున్న విధానం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.