ప్రభాస్ 20: రాధేశ్యామ్ టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారంటే?

radhe shyam

రెబల్ స్టార్ ప్రభాస్ 20వ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ఇటీవల రిలీజైన విషయం తెలిసిందే. రాధేశ్యామ్ అనే టైటిల్ జనాలకు అమితంగా నచ్చేసింది. యూవీ క్రియేషన్స్ ఆలస్యంగా ప్రకటించినప్పటికీ మంచి టైటిల్ సెట్ చేసిందని పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అయితే ఈ ఇంత మంచి టైటిల్ పెట్టడానికి కారణం ఎవరు అనే అంశం అందరిలో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ని కలిగిస్తోంది.

దర్శకుడు రాధాకృష్ణ ఈ కథ రాసుకున్నప్పటి నుంచి సినిమా టైటిల్స్ కోసం చాలా రీసెర్చ్ చేశాడు. జాను అనే టైటిల్ ఆల్ మోస్ట్ సెట్టయ్యింది అనుకుంటున్న సమయంలో దిల్ రాజు దాన్ని తీసుకోవడంతో మరో టైటిల్ వేతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శకుడు రాధాకృష్ణ ఆలస్యం చేయకుండా తన గురువు చంద్రశేఖర్ యేలేటి దగ్గరికి వెళ్లాడట.

ఎంతో కాలంగా చంద్రశేఖర్ సినిమాలకు రాధాకృష్ణ సహాయక దర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇక ఆయన దగ్గరకు వెళ్లి కథ గురించి చర్చలు జరపగా వెంటనే రాధేశ్యామ్ అనే టైటిల్ ని సజెస్ట్ చేశారట. టైటిల్ క్యాచిగానే కాకుండా స్టైలిష్ గా ఉండడంతో పాటు ప్రభాస్ కి కూడా నచ్చేసింది. అలాగే యూవీ క్రియేషన్స్ కి కూడా నచ్చడంతో వెంటనే అలా టైటిల్ ని ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.