త్వరలో ‘సీతా కళ్యాణ వైభోహమే’

సుమన్ తేజ్ హీరోగా, గరీమ చౌహన్ హీరోయిన్ గ నటిస్తూ మన ముందుకు వస్తున్న సినిమా సీతా కళ్యాణ వైభోహమే. ఈ సినిమా సతీష్ పరమవేద దర్శకత్వలో రాబోతుంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై రాబోతున్న ఈ సినిమాని రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి పాజిటివ్ తెచ్చిపెట్టింది.

అయితే ఈ సినిమా విడుదల తేదీ ఖరారు చేసారు మేకర్స్. ఈ నెల 26న ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈసినిమాకు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్, కెమెరామెన్ పరుశురామ్, ఎడిటర్ డి.వెంకట ప్రభు, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్ పనిచేస్తున్నారు. గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, వెంకీ మంకీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.