విశాల్ ‘రత్నం’ నుండి ‘చెబుతావా’ పాట విడుదల

రత్నం సినిమాతో హీరో విశాల్ మరోసారి మన ముందుకు రాబోతున్నారు. జీ స్టూడియోస్‌తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ డైరెక్టర్ హరి ఈ మూవీకి దర్శకత్వం చేస్తుండగా కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. గతంలో రిలీజ్ అయినా ఈ సినిమా గ్లింప్సె ఇంకా పాటలు మంచి ఆదరణ పొందాయి.

ఈ సినిమాలో హీరోయినిగా ప్రియా భవాని శంకర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న విష్యం తెలిసిందే. సినిమా విడుదల దగ్గర పడుతున్న ఈ సమయంలో ఓ మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసారు మేకర్స్. కళ్యాణ్ సుబ్రహ్మణ్యం అలంకార్ పాండియన్ కో-ప్రోడ్యుసర్‌గా రాబోతోన్న ఈ మూవీకి ఎం సుకుమార్ కెమెరామెన్‌గా, టీ ఎస్ జై ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 26న విడుదల కానుంది.