తెరపైకి మరో ప్రతిష్టాత్మక బయోపిక్

ఈ మధ్య బయెపిక్‌ల ట్రెండ్ బాగా నడుస్తోంది. బయోపిక్ సినిమాలు ఎక్కువగా తీస్తున్నారు. ప్రముఖ వ్యక్తుల బయోపిక్ సినిమాలను తెరకెక్కించేందుకు డైరెక్టర్లు ఆసక్తి చూపడమే దీనికి కారణం. అలాగే ప్రముఖ వ్యక్తుల జీవిత కథను తెలుసుకునేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో బయెపిక్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. క్రీడా రంగంలో పాపులర్ అయిన వ్యక్తులపై ఎక్కువగా బయోపిక్‌ సినిమాలు తీస్తున్నారు.

dhyan chand

ఇప్పటికే క్రికెట్ నుంచి ధోనీ బయెపిక్ తెరకెక్కగా.. టెన్నిస్ నుంచి సానియా, బ్యాడ్మింటన్ నుంచి వీపీ సింధు, సైనా నెహ్వాల్, ఉమెన్ క్రికెట్ నుంచి మిథాలీ రాజ్, చెస్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్ సినిమాలు తెరకెక్కాయి. వీటిల్లో కొన్ని బయోపిక్ సినిమాలు ఇప్పటికే విడుదల అవ్వగా.. మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. అయితే తాజాగా మరో దిగ్గజ ఆటగాడి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అదే దిగ్గజ ఆటగాడు ధ్యాన్ చంద్ బయోపిక్. భారత హాకీ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని పేరు ధ్యాన్ చంద్. భారత్‌కి ఏకంగా 11 స్వర్ణాలు అందించారు. ధ్యాన్ చంద్. హాకీలో ఇండియాను ప్రపంచ చాంపియన్‌గా నిలబెట్టారు. ఆయన బయెపిక్ సినిమాకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. బాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ చౌబే ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. 2022లో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు.