చిరుతో సమానంగా రాంచరణ్ పాత్ర

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమాలో నటిస్తుండగా.. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక సెట్‌లో దీని షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. ఇందులో రాంచరణ్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాంచరణ్ పాత్రకు సంబంధించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఇందులో రాంచరణ్‌ది గెస్ట్ రోల్ అని అందరూ అనుకున్నారు. కానీ రాంచరణ్‌ది గెస్ట్ రోల్ కాదట.

CHIRU AND RAM CHARAN

ఆచార్యలో చిరంజీవి పాత్రకు సమానంగా రాంచరణ్ పాత్ర ఉంటుందట. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ నటిస్తుండగా.. ఆచార్య షూటింగ్‌లో పాల్గొనేందుకు ఈ షూటింగ్ నుంచి రాంచరణ్ కాస్త బ్రేక్ తీసుకున్నాడు. సంక్రాంతి తర్వాత ఆచార్య షూటింగ్‌లో రాంచరణ్ పాల్గొనే అవకాశముంది. అయితే రాంచరణ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు. ఒక బాలీవుడ్‌ను హీరోయిన్‌ను తీసుకునేందుకు సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి సొంత ప్రొడక్షన్ కంపెనీ కొణిదెల, మ్యాట్నీ ఎంటర్‏టైన్‏మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తుండగా.. సమ్మర్‌లో దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాను రానున్న సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా భావించారు. కానీ లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.